బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సిద్దిపేట నుంచి నలుగురు సీనియర్ నాయకులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో విద్యాసాగర్, అంబటి బాలేష్ గౌడ్, చింత సంతోష్, తుంగ కనకయ్య ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని, అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.