సిద్ధిపేట: శాంతియుత పోరాటానికి ప్రతీక గాంధీ

4చూసినవారు
సిద్ధిపేట: శాంతియుత పోరాటానికి ప్రతీక గాంధీ
శాంతియుత పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయులు మహాత్మాగాంధీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈహెచ్ఎస్ అమలు, పీఆర్సీ తక్షణ ప్రకటన, వెల్‌నెస్ సెంటర్లలో మందుల లభ్యత, వివిధ సేవలకు సంబంధించిన ఆసుపత్రుల వివరాలు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు.