సిద్దిపేట: టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ తో గ్యాస్ సరఫరా

0చూసినవారు
సిద్దిపేట: టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ తో గ్యాస్ సరఫరా
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ, జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలకు టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 60 కిలోమీటర్లకు పైగా పైప్ లైన్ విస్తరించినట్లు, గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయని, భద్రతాపరంగా ఎలాంటి ప్రమాదాలు ఉండవని ఆమె పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వ సంస్థలకు, ఆ తర్వాత గృహాలకు గ్యాస్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్