సిద్దిపేట: గోటి తలంబ్రాలు... కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం

3చూసినవారు
సిద్దిపేట: గోటి తలంబ్రాలు... కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం
సిద్దిపేట రూరల్ మండల పరిధి పుల్లూరు గ్రామంలోని శివాలయంలో సోమవారం గోటి తలంబ్రాలు, కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం నుంచి తెచ్చిన గోటి తలంబ్రాలను కలశాలలో నింపి, రామనామస్మరణతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. గోటితో ఓలిచిన తలంబ్రాలను భక్తులు రామకోటి రామరాజుకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్