సిద్ధిపేట జిల్లా రామంచ వద్ద సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ధాన్యం ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఎండల్లో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు తెలిపారు. ఎస్ఐ చంద్రమోహన్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.