ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాదవ విద్యార్థులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తన నెలసరి వేతనం నుండి రూ. 2 లక్షలు అందజేశారు. సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, హరీశ్ రావు మంచి కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.