సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానాలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా కౌమార బాలికలకు ఆరోగ్య
పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ మాట్లాడుతూ, కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వ్యాధులను దూరం చేసుకోవచ్చని, బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రక్తహీనత, హిమోగ్లోబిన్, షుగర్ వంటి
పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు.