సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శనివారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 23 మందికి రూ. 2,63,000 జరిమానా విధించారు. ఇటీవల ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు కుమార్ నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో 17 మందికి రూ. 85,000 జరిమానా విధించారు.