సిద్దిపేట జిల్లావ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. జిల్లాలోని పలు గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, గ్రహణ ప్రభావం కారణంగా బుధవారం నాడు కూడా హోలీని జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.