హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద సిద్దిపేటకు చెందిన దంపతులు తమ పొలం గొడవలపై న్యాయం జరగడం లేదనే ఆవేదనతో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్యూరిటీ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకుని, నీళ్లు పోసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.