సిద్దిపేట: పోలీసు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

1చూసినవారు
సిద్దిపేట: పోలీసు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 8వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై కూడా మే 23 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్