సిద్దిపేట: ప్రజా రక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి

0చూసినవారు
సిద్దిపేట: ప్రజా రక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
ప్రజా రక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సిద్ధిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. సోమవారం పోలీసు కమిషనరేట్లో 'సిద్ధిపేట సురక్ష నేత్ర' లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఒక్కరోజే పలు గ్రామాల్లో 200కు పైగా సీసీ కెమెరాలను ప్రారంభించామని తెలిపారు. ఏదైనా ఘటన జరిగినపుడు ప్రజలు స్పందించి పోలీసులకు సమాచారం అందించాలని, సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా మారతాయని ఆమె పేర్కొన్నారు. 'సిద్ధిపేట సురక్ష నేత్ర' ద్వారా 'కనెక్టెడ్ విలేజెస్, ప్రొటెక్టెడ్ కమ్యూనిటీస్' అనే ట్యాగ్ లైన్ తో ముందుకు వెళ్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్