సెల్ టవర్ బ్యాటరీలు, డీజిల్ దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులు ఐదుగురిని, వాటిని కొనుగోలు చేసిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 బ్యాటరీలు, రూ. 3.01 లక్షల నగదు, రెండు ఆటోలు, ఓ కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెంకు చెందిన బత్తుల గురుస్వామి నేతృత్వంలోని ముఠా ఈ దొంగతనాలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించారు.