సిద్దిపేట: ప్రతిభా పురస్కారాలకు ఆహ్వానం

3చూసినవారు
సిద్దిపేట: ప్రతిభా పురస్కారాలకు ఆహ్వానం
పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శాలివాహన విద్యార్థులకు 'ప్రతిభా పురస్కారాలు' అందజేయనున్నట్లు జిల్లా శాలివాహన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ చదివినా, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అర్హులైన శాలివాహన విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 12లోగా 7095718703, 9866008319, 9849920700, 9491268087, 9908334409 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్