సిద్దిపేట జిల్లాలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కార్తీక దీపాలు, శివ నామస్మరణతో భక్తితో వెలిగిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్తీకపురాణం, విష్ణుపారాయణం, ఉసిరి, తులసీ కోటల వద్ద గౌరమ్మ తల్లికి పూజలు చేసి, దీపారాధన చేశారు. జిల్లా కేంద్రంలోని ఆలయాలతో పాటు నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహించారు. శివ, కేశవుల నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.