సిద్దిపేట: కవిత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత సుతారి మేస్త్రీలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలంగాణ సుతారి సంఘం అధ్యక్షులు ధరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో సెంట్రింగ్ కార్మికుల మహాసభలో 'సుతారి హటావో, సెంట్రింగ్ కో బచావో' అని కవిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కార్మికులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను సంఘం తీవ్రంగా ఖండించింది. సెంట్రింగ్ కార్మికులకు మద్దతు పలకడం తప్పు కాదని, కానీ మేస్త్రీలను అవమానించడం సిగ్గుచేటని చంద్రం పేర్కొన్నారు.
