సిద్దిపేట: కేసీఆర్, హరీశ్ రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

0చూసినవారు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని వాగవతలి గ్రామాలకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు కృషిచేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుకు బీఆర్ఎస్ నేతలు, రైతులు క్షీరాభిషేకం నిర్వహించారు. అక్కేనపల్లి, గట్లమల్యాల, ఘణపూర్ గ్రామాల పక్కనే వాగుపారుతున్నా సాగునీరు లేక ఇబ్బందులు పడ్డామని, రైతుల కోరిక మేరకు లిఫ్ట్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి హరీష్ రావు నిధులు మంజూరు చేయడంతో 13 చెరువులను నింపి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చారని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్