సిద్దిపేట: ఖమ్మం ఘటన నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

0చూసినవారు
సిద్దిపేట: ఖమ్మం ఘటన నిందితుడికి కఠిన శిక్ష విధించాలి
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో తెలంగాణ గో రక్షక్ దళ్ రాష్ట్ర సభ్యుడు గ్యాదరి రాజారాం మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని, నిందితుడికి చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని కోరారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్