సోషల్ మీడియాలో విద్వేషకర, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట పోలీసు కమిషనర్ అనురాధ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మార్పింగ్ ఫొటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ పెడితే చర్యలు తప్పవన్నారు. విద్వేషకర పోస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు కమిషనర్ కంట్రోల్ రూం నంబర్ 8712667100కు సమాచారం అందించాలన్నారు.