సిద్దిపేట జిల్లా కేంద్రంలో మై భారత్ కార్యాలయ ఆవరణలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన 'ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం' అనే కరపత్రాన్ని మై భారత్ జిల్లా ప్రోగ్రాం అధికారి కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రకృతికి ఇచ్చే గొప్ప బహుమతి వ్యర్థాలను తగ్గించాలని, అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.