సిద్దిపేట: అమర్ నాథ్ యాత్రకు ఈ నెల 15న సరుకులతో లారీ పయనం

1చూసినవారు
సిద్దిపేట: అమర్ నాథ్ యాత్రకు ఈ నెల 15న సరుకులతో లారీ పయనం
మంచుకొండల్లో మహిమాన్వితమైన అమర్నాథ్ యాత్రకు భక్తులకు దక్షణాది రుచులను అందించడానికి ఈనెల 15న సరుకుల లారీ వెళ్తుందని అమర్నాద్ అన్నదాన సేవ సమితి అధ్యక్షుడు శివ్వా శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అమర్నాథ్ యాత్ర కరపత్రికను ఆవిష్కరించారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, సరుకుల లారీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్