వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేటకు చెందిన ఓంకార్, తార, రాజు, వినోద్ కృష్ణమూర్తిల పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు రికవరీ చేసి గురువారం బాధితులకు అప్పగించారు. ఐఎంఈఐ నంబర్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్టర్ పోర్టల్ లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఫోన్లను గుర్తించి, దొరికిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లు పోయిన వెంటనే ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తే తిరిగి పొందే అవకాశం ఉందని ఆయన సూచించారు.