సిద్ధిపేట: క్షౌరశాలలోనే వ్యక్తి ఆత్మహత్య

2చూసినవారు
సిద్ధిపేట: క్షౌరశాలలోనే వ్యక్తి ఆత్మహత్య
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో సోమవారం ఒక క్షౌరకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లచ్చపేట 11వ వార్డుకు చెందిన మిరుదొడ్డి స్వామి (42) తన క్షౌరశాలలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. బస్టాండ్ సమీపంలోని భవనం పైఅంతస్తులో ఉన్న తన షాపులోనే ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. కొంతసేపటి తర్వాత షాపులో పనిచేసే వ్యక్తి వచ్చి చూడగా స్వామి చనిపోయి కనిపించాడు. స్థానికుల కథనం ప్రకారం, అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
Job Suitcase

Jobs near you