సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి, మాచాపూర్ శివారులో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో జంగిటి రాజు అనే రైతు మృతి చెందాడు. దుబ్బాక మండలం బల్వాంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, పడిగె నర్సయ్య వద్ద పౌల్ట్రీఫాంను లీజుకు తీసుకున్నాడు. కోడిపిల్లలకు దాన పెట్టేందుకు వెళ్ళిన రాజు, విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా, మృతదేహాన్ని గుర్తించింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.