సిద్ధిపేట: లారీని ఢీకొని వ్యక్తి మృతి

2చూసినవారు
సిద్ధిపేట: లారీని ఢీకొని వ్యక్తి మృతి
మండల పరిధిలోని చర్లంకిరెడ్డిపల్లి స్టేజి వద్ద గురువారం రాత్రి లారీని ఢీకొని కాశవేణి పోశయ్య(55) అనే వ్యక్తి మృతి చెందాడు. సివిల్ సప్లై గోదాము నుండి బయటకు వస్తున్న లారీని, శనిగరం వైపు వెళ్తున్న పోశయ్య వెనుక భాగం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాదు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రావడంతో లారీ అకస్మాత్తుగా ఆగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోశయ్యకు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై చిన్నకోడూరు ఎస్సై సైఫ్ హాలీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్