సిద్దిపేట: కేసీఆర్ పాలనలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

1చూసినవారు
సిద్దిపేట: కేసీఆర్ పాలనలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో ముస్లిం మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే హరీష్ రావుకు పట్టణానికి చెందిన ముస్లిం నాయకులు, మత పెద్దలు బుధవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి 4 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 3500 కోట్లు మాత్రమే కేటాయించిందని, అందులోనూ 1600 కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్