రంగనాయక సాగర్ కాలువలో కనిపించిన మృతదేహం కేసులో కానిస్టేబుల్ గౌటే ప్రవీణ్ కుమార్, అతని భార్య గౌటే రజితను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ లో రూ.36 లక్షలు నష్టపోయిన ప్రవీణ్ కుమార్, అప్పులు తీర్చడానికి బెలిదే విశ్వనాథ్ ను హత్య చేసి, అతని బంగారాన్ని దొంగలించినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. విశ్వనాథ్ ను కారులో తీసుకెళ్లి, చేతులు కట్టేసి, వైరుతో మెడ బిగించి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేశారు. దొంగలించిన బంగారాన్ని హైదరాబాద్ లో విక్రయించి, అప్పులు తీర్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. గతంలో బొడ్డు నరసవ్వ పుస్తెల తాడును దొంగలించి, ఆ డబ్బును బెట్టింగ్ లో పెట్టినట్లు కూడా తెలిపారు.