నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్ ని ఆదేశించారు. సోమవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయములో మాట్లాడుతూ మెదక్, ఎల్కతుర్తి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా సిద్దిపేట నుండి జిల్లా పరిధి చివరి ప్రాంతం వరకు నేషనల్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. హుస్నాబాద్ టౌన్లో డెవలప్మెంట్ పనులు మొదలు పెట్టాలని తెలిపారు.