సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమ్యూనికేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జిల్లాలో ఇంటర్నెట్ వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా నెట్‌వర్క్ సేవలు అందించాలని టెలికాం కంపెనీల ప్రతినిధులను ఆమె ఆదేశించారు. నెట్‌వర్క్ సమస్యలు తలెత్తినప్పుడు, 'కాల్ బిఫోర్ యూ బిగ్ - యాప్' లో సమస్యను అప్‌లోడ్ చేస్తే స్థానిక అధికారులకు సమాచారం చేరుతుందని తెలిపారు.