సిద్దిపేట: ఎస్ఐఆర్ పై అపోహలు వద్దు

1630చూసినవారు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలోసోమవారం విలేకరులతో మాట్లాడిన ఎంపీ రఘునందన్, ఎస్ఐఆర్ (సెలెక్టివ్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టింగ్) ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనే వార్తలను అవాస్తవమని కొట్టిపారేశారు. నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఎలతో కలిసి ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చి, స్వగ్రామాలతో పాటు పట్టణాలలోనూ ఓట్లు ఉన్నవారి విషయంలో ప్రైవేట్ వ్యక్తులు చేసే ఓట్ల మ్యాపింగ్‌లకు ప్రజలు సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్