ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులు రవీంద్రభారతిలో ఈ నెల 31న ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 78వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్లో జయంతి ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గద్దరన్న జయంతి ఉత్సవాల్లో అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలే గద్దరన్న నిజమైన వారసులని, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.