జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి నిర్వహించనున్న స్వీయ గణనలో ప్రజలు పాల్గొనాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. వెబ్ పోర్టల్ https://se.census.gov.in/లో ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని, మే 11 తర్వాత ఇంటికి వచ్చే జనగణన అధికారులకు చూపిస్తే ధృవీకరిస్తారని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్జి, ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందించి, వారి స్వగృహంలో స్వీయ గణన, జియో ట్యాగింగ్ ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేయించాలని సూచించారు.