సిద్దిపేట: పోలీసులకు చిక్కిన గంజాయి బ్యాచ్

గజ్వేల్ పోలీసులు, సిద్దిపేట జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ అంజద్, టంగుటూరి శివానందం, పనిర్ తేజ, మొహమ్మద్ సోహైల్, మద్దికుంట గణేష్, బట్టి బాలక్రిష్ణ, ఉప్పరి ఉదయ్ కిరణ్ అనే ఏడుగురిని గజ్వేల్ పట్టణంలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు, ఒక చిలాం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
