సిద్దిపేట: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలి

1చూసినవారు
సిద్దిపేట: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలి
సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ హైమావతి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్