సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, అటెండెన్స్, ఓపీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది, మౌలిక వసతుల కొరత ఉంటే డీఎంహెచ్ఎను సంప్రదించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న నర్సింగ్ కళాశాల విద్యార్థులతోనూ మాట్లాడారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆమె ఆదేశించారు.