సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గంప శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ నియామకంపై జిల్లా కోశాధికారి డాక్టర్ మంకాల నవీన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తణుకు ఆంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు అయిత రత్నాకర్, మంచాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.