జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ రహదారి భద్రత మనందరి బాధ్యత అని అన్నారు. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గులు, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు.