సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ రశ్మి పెరుమాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ హైమావతి రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రత కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురవుతారని కలెక్టర్ తెలిపారు.