సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలంలోని దర్గపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారి కుంగిపోయింది. చెరువు నిండి మత్తడి దూకుతున్న ప్రవాహానికి రహదారి దెబ్బతిందని గ్రామస్థులు శుక్రవారం తెలిపారు. ఈ రహదారి కుంగిపోవడంతో బద్దిపడగ, గుండారెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.