సిద్దిపేట: కేసీఆర్ దత్తత గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

10చూసినవారు
సిద్దిపేట: కేసీఆర్ దత్తత గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడు విడతలుగా జరుగుతోంది. మర్కుక్ మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన కవితా రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. ఇదే విధంగా నరసన్న పేట గ్రామంలోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊరటనిచ్చింది.