సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి మంగళవారం మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురు వాహనదారులకు మొత్తం రూ. 71,000 జరిమానా విధించారు. పట్టణంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు.