గ్రామపంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి కె. పరమేశ్వర్, ములుగు ఎంపీవో కలీం, జగదేవపూర్ ఎంపీవో ఖాజామోహినోద్దీన్లకు ఈ నోటీసులు అందాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.