సిద్దిపేట: మహాలక్ష్మి పథకంతో మహిళలకు గణనీయమైన ఆర్ధికప్రయోజనం

3చూసినవారు
సిద్దిపేట: మహాలక్ష్మి పథకంతో మహిళలకు గణనీయమైన ఆర్ధికప్రయోజనం
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు దాదాపు రూ. 10 వేల కోట్లను ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్