సిద్ధిపేట: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

4చూసినవారు
సిద్ధిపేట: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్
సిద్దిపేట కోర్టు భవనంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు లీగల్ సర్వీసెస్ ఆథారిటీ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. శనివారం న్యాయమూర్తులు, పోలీస్ కమిషనర్ తో సమావేశం నిర్వహించి, ఈ లోక్ అదాలత్ లో ఎన్ఐ ఆక్ట్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మెయింటెనెన్స్, బ్యాంకు రికవరీ, ఎక్సైజ్ కేసులను పరిష్కరించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఫస్ట్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్