ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సిద్దిపేటలో తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, పాఠశాల సముదాయాల నిర్వహణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.