జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం సిద్దిపేట అర్బన్ మండలం రంగధాంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన ఆమె, బిర్యానీ అన్నం, ఆలుగడ్డ, టమాటా కూరలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం కొలత ప్రకారం ఆహార పదార్థాలను అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.