విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న జిల్లాలోని మైనార్టీ
విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్శీలు) ముఖ్యమంత్రి విదేశీ విద్యా ఉపకార వేతన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్చార్జి అధికారిణి నాగరాజమ్మ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 2026 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు అడ్మిషన్లు పొందిన
విద్యార్థులు అర్హులన్నారు.
విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.