సిద్ధిపేట: ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

76చూసినవారు
సిద్ధిపేట: ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత
విద్య లేనిదే విముక్తి లేదని అంబేద్కర్ నమ్మిన సిద్దాంతమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా పేద పిల్లలు చదువుల గురించి ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యూకేషనల్ సోసైటీకి రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్