సిద్దిపేట: మహిళా రైతు తారవ్వను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం

9చూసినవారు
సిద్దిపేట: మహిళా రైతు తారవ్వను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం
సిద్దిపేట జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా డ్రైనేజీలో కొట్టుకుపోయిన మహిళా రైతు తారవ్వ వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసుకున్న ధాన్యం కొట్టుకుపోవడంతో ఆమె తీవ్రంగా రోదించింది. జిల్లా కలెక్టర్ ఆమెకు భరోసా ఇచ్చి, కొట్టుకుపోయిన 106 క్వింటాళ్ల ధాన్యానికి క్వింటాలుకు రూ.2390 మద్దతు ధరతో రూ.2,55,145 చెల్లించారు. సీఎంకు రైతు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్