సిద్దిపేట: ఆలయాలు సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకలు

794చూసినవారు
సిద్దిపేట: ఆలయాలు సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకలు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి, ఆలయాలు సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకలని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ప్రార్థించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని, సేవాభావాన్ని, భక్తి తత్వాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్